ICC Warns Pakistan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కోర్టుకు జియోస్టార్!.. రూ.315 జరిమానా..?
- ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం..
- పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కోర్టుకు జియోస్టార్!
- పాక్ కి ఇచ్చే రూ. 315కోట్లు ఆపేసి.. బ్రాడ్‌కాస్టర్లకు ఇవ్వనున్న ఐసీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Warns Pakistan: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026పై వివాదం కొనసాగుతుంది. ఈ నెల (ఫిబ్రవరి) 15న కొలంబోలో భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై న్యాయపరమైన చర్యలు తప్పవని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హెచ్చరించింది. పీసీబీకి వ్యతిరేకంగా ప్రపంచకప్ ప్రసారదారు జియోస్టార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఛాన్స్ ఉందని తెలిపింది. వార్షిక ఆదాయంలో వాటాగా పీసీబీకి చెల్లించాల్సిన 35 మిలియన్ డాలర్ల (రూ.315 కోట్లు)ను నిలిపివేసి, అందులోంచి జియోస్టార్ కి ఐసీసీ పరిహారం చెల్లించబోతుందని సమాచారం. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన నిర్ణయాన్ని ఐసీసీకి ఇంకా పీసీబీ లిఖితపూర్వకంగా తెలియజేయలేదు.
Read Also: MS Dhoni: ఇట్లాంటి టీమిండియాను నేను ఇప్పటివరకు చూడలేదు.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, ఐసీసీ ఈవెంట్ల కోసం నాలుగేళ్ల కింద జియోస్టార్ తో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చేసుకున్న ఒప్పందంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. దాని ఆధారంగానే ఐసీసీకి ప్రసారదారు చెల్లింపులు చేసింది. కాబట్టి పీసీబీ, ఐసీసీలపై కోర్టుకెళ్లే అధికారం బ్రాడ్‌కాస్టర్లకు ఉందని ఓ పీసీబీ అధికారి కూడా చెప్పాడు. మరోవైపు, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన నిర్ణయాన్ని పీసీబీ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ అంశంపై గత వారం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు వివరించే ముందు బోర్డు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నప్పటికీ, తీవ్రమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించకపోతే, భారీ ఆర్థిక జరిమానాలు, బ్రాడ్‌కాస్టర్ల నుంచి కేసులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఐసీసీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ (DRC)ను ఆశ్రయించినా ఫలితం ఉండకపోవచ్చని పీసీబీలోని ఒక వర్గం వెల్లడించింది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!