Pakistan vs ICC: భారత్ మ్యాచ్‌కే బాయ్‌కాట్ ఎందుకు?.. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిపై ఐసీసీ ఫైర్
- క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం..
- భారత్‌తో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటన..
- టోర్నీలో కొనసాగుతునే భారత్ మ్యాచ్‌నే బాయ్‌కాట్ చేసిన పాకిస్థాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs ICC: క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసేలా భారత్‌తో జరగాల్సిన తమ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను (ఫిబ్రవరి 15) “బహిష్కరిస్తున్నట్లు” పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరించి మిగతా అన్ని జట్లతో ఆడేందుకు అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఈ నిర్ణయాన్ని బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తీసుకున్న చర్యగా పాకిస్థాన్ ప్రభుత్వం సమర్థించుకుంటున్నా.. లోతుగా పరిశీలిస్తే ఇందులో స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చేందుకు ఐసీసీ నిరాకరించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది అని ఆ దేశ పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రకారం చేసింది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే వరల్డ్ కప్‌లకు హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించిన ఐసీసీ, ఇప్పుడు “పక్షపాత నిర్ణయాలు” తీసుకుంటోందని పాక్ ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్‌ను ఆడవద్దని జట్టుకు ఆదేశాలు ఇచ్చాం.. ఇది ఒక నిరసన చర్య, “న్యాయం, సమానత్వం అనే సూత్రాలు పక్షపాత నిర్ణయాలతో ధ్వంసమయ్యాయి” అని అక్కడి న్యూస్ ఛానల్ పేర్కొంది.
Read Also: Nagarajuna Akkineni : నాగ్ కోసం కథ రెడీ చేస్తున్న హిట్ దర్శకుడు
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
భారత్- ఐసీసీపై పాక్ మీడియా అక్కసం:
అయితే, పాకిస్థాన్ మొత్తం టోర్నీ నుంచే తప్పుకోవాల్సి ఉండేది.. కానీ భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరించి, మిగతా అన్ని మ్యాచ్‌లలో పాల్గొనడం ద్వారా ఐసీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని పీసీబీ అందుకుంటూనే ఉంది. అదే ఐసీసీని పక్షపాత సంస్థగా విమర్శిస్తూ, దాని ప్రయోజనాలను ఆస్వాదించడం స్పష్టమైన విరుద్ధతగా కనిపిస్తోంది. ఇక, భారత్ పాకిస్థాన్‌కు వెళ్లి ఆడేందుకు నిరాకరించడంపై పాక్ గతంలో ఎన్నో సార్లు నిరసనలు తెలిపింది. అయినప్పటికీ, భారీ గ్లోబల్ వీక్షకులు, భారీ ఆదాయం దృష్ట్యా ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో ఆడేందుకు మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అలాంటిది, ఇప్పుడు అకస్మాత్తుగా భారత్‌తో ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరించి బంగ్లాదేశ్‌కు మద్దతు తెలిపితే, రాజకీయ లబ్ధి కోసం వేసిన ఎత్తుగడగా కనిపిస్తోందా అని పాక్ కి చెందిన కొందరు విమర్శకులు గుప్పిస్తున్నారు. ఇక, ఒకే టోర్నీలో ఒక కీలక మ్యాచ్‌ను మాత్రమే వదిలేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.. నిజంగా ‘న్యాయ సూత్రాల’ కోసం బహిష్కరణ అనుకుంటే, మొత్తం ఈవెంట్ నుంచే తప్పుకోవాల్సి ఉంటుంది.. కానీ అలా చేయకుండా, టోర్నీకి అతిపెద్ద ఆదాయాన్ని తెచ్చే భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ను మాత్రమే అడ్డుకోవడం.. అదే సమయంలో ఆర్థిక శిక్షలు లేదా క్రీడా ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా పాకిస్తాన్ చేసిందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఘాటుగా ఐసీసీ రియాక్షన్:
పాక్ ఆరోపణలపై ఐసీసీ తాజాగా స్పందించింది.. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు దాయాది దేశం పునరాలోచన చేయాలని కోరింది. రాజకీయ కారణాలతో జట్లు తమకు నచ్చిన ప్రత్యర్థులను ఎంచుకుని బహిష్కరిస్తే, వరల్డ్‌కప్ నిర్మాణం, విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుందని ఐసీసీకి తెలుసు.. ఇలాంటి ఎంపిక చేసిన మ్యాచ్ లు బహిష్కరణ చేయడం అంతర్జాతీయ క్రీడలకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని బీసీసీఐపై కాకుండా ఐసీసీపై నిరసనగా చిత్రీకరించడం ద్వారా పాకిస్థాన్ నైతిక ఆధిక్యత సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ టోర్నీలో కొనసాగుతూ ఆర్థిక లాభాలను పొందుతున్నందుకు, ఈ “బహిష్కరణ” సమానత్వం కోసం చేసిన పోరాటంలా కాకుండా, ఒక నాటకీయ ప్రదర్శనలా మారిందన్న అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!