పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “భీమ్లా నాయక్” ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిమించిన ఈ చిత్రం ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడిన విషయం తెలిసిందే. మలయాళంలో హిట్ అయిన “అయ్యప్పనుమ్ కోషియం” చిత్రానికి రీమేక్ అయిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న విడుదల కానుంది. అయితే అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. సంగీత స్వరకర్త ఎస్ థమన్ ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారట.
Read Also : పెళ్లి చేసుకోమన్న వేశ్య… ‘శ్యామ్ సింగ రాయ్’ రియాక్షన్ చూడాల్సిందే !
తాజాగా థమన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత నటన, భీమ్లా నాయక్ రోల్ ఆయన కెరీర్ లోనే బెస్ట్ అవుతుందని, పవన్ తన నటనతో చంపేశాడని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా పవన్‌కి బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, పవన్ అందరినీ షాక్‌కి గురి చేస్తాడని ఆయన అన్నారు. త్రివిక్రమ్‌తో కలిసి సినిమాను చూశానని, ఆయన కూడా స్టార్ నటనకు థ్రిల్ అయ్యారని థమన్ వెల్లడించారు. థమన్ చెప్పిన ఈ మాటలు మెగా అభిమానుల్లో సినిమాను తొందరగా వెండి తెరపై వీక్షించాలన్న ఉత్సాహాన్ని మరింతగా ఉరకలెత్తిస్తోంది.