పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు విడుదల తేదికి సమయం దగ్గర పడుతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ చిత్రం జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా… ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాల విడుదలకు మార్గం సుగమం చేస్తూ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25కి విడుదల తేదీని వాయిదా వేసుకున్నాడు. ఇక ఇప్పుడు “భీమ్లా నాయక్” ప్యాచ్‌వర్క్ భాగాలను పూర్తి చేసి, ప్రకటించిన తేదీనే విడుదలకు సిద్ధంగా ఉన్నారని వినికిడి.
Read Also : బ్రా సైజ్, గాడ్ కామెంట్స్ వివాదం… సారీ చెప్పిన హీరోయిన్
జనవరి నెల పూర్తయ్యింది. సినిమా విడుదలకు మరో 24 రోజులు మాత్రమే మిగిలి ఉండగా… వి వాంట్ “భీమ్లా నాయక్” అప్డేట్ అంటూ మెగా ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో రచ్చ చేస్తున్నారు. సినిమా నుంచి త్వరలోనే టీజర్, ట్రైలర్ ల అప్డేట్స్ రావాలని ఆశిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 24న యూఎస్ఏ లో ప్రీమియర్లకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. థమన్ స్వరపరచిన పాటలు ఇప్పటికే దుమ్మురేపిన విషయం తెలిసిందే. మరి అభిమానుల డిమాండ్ మేరకు మేకర్స్ ‘భీమ్లా నాయక్’ అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.
