పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు లైన్లో ఉండగా.. మరో రెండు సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. వచ్చేహెనెలలో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇవి కాకుండా.. సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరికి పవన్ విషయంలో ఆందోళన పట్టుకున్నదంట. ఎందుకంటే పవన్ కొత్తగా ఒక కండిషన్ పెట్టారని, దానివలన డైరెక్టర్లందరూ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఆ కండిషన్ ఏంటీ అంటే.. పవన్ షూటింగ్ కోసం కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇస్తానని, అంతకుమించి ఎక్కువ కుదరదని తేల్చి చెప్పాడంట. ఏం చేసినా.. తాను ఇచ్చిన 60 రోజుల్లోనే తన షూటింగ్ పార్టును ముగించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే దర్శకులకు టెన్షన్ తప్పదు. హీరో కాల్షీట్లు తక్కువ ఉంటే షూటింగ్ ని పరుగులు తీయించాలి. దీనికోసం దర్శక నిర్మాతలు సైతం ఉరుకులు పరుగులు పెట్టాలి. అందుకే వారందరు కొంచెం పవన్ ని ఇంకోసారి ఆలోచించాలని కోరుతున్నారట. అయితే పవన్ సమయాన్ని మొత్తం సినిమా మీదే ఉంటె రాజకీయాలకు సమయం ఉండే ఉద్దేశయంతో నిర్దిష్టమైన సమయాన్ని మాత్రమే సినిమాలకు కేటాయించాలని భావిస్తున్నారట. అందులోను ఈసారి ఎన్నికలకు ఆయన ముందు నుంచే గట్టిగా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ ని అర్ధం చేసుకొని డైరెక్టర్లు ఉరుకులు పరుగులు పెడతారో.. లేక పవన్ దొరికేవరకు వెయిట్ చేస్తారో చూడాలి.