కిక్కా? బ్యాడ్ లక్కా?… ఫిబ్రవరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఇదీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022 తెలుగు చిత్ర పరిశ్రమకు నిరాశాజనకంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. జనవరిలో విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపైనే ఉంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద చిత్రాలు ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ మహమ్మారి మూడవ వేవ్ కారణంగా అవి వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి వంటి చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్ట్ చేయలేకపోయాయి. ‘బంగార్రాజు’కు డీసెంట్ ఓపెనింగ్స్, మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ, చాలా ఏరియాల్లో లాస్ వెంచర్‌గా మిగిలిపోయింది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి.
Read Also : విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ !
Also Read
అందుకే ఇప్పుడు ఆశలన్నీ ఫిబ్రవరి రిలీజ్ ల పైనే ఉన్నాయి. నిజానికి గత ఏడాది టాలీవుడ్ బ్యాడ్ లక్ గా భావించే ఫిబ్రవరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ కు మంచి కిక్ ఇచ్చింది. కానీ ఫిబ్రవరి పరీక్షల సీజన్ కావడంతో మందకొడిగా ఉంటుంది. ఇప్పుడు దానికి మహమ్మారి కూడా తోడైంది. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ, 50% ఆక్యుపెన్సీ ఉంది. కాబట్టి ఈ పరిమితులలో సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తే మేకర్స్‌కు ఇబ్బందులు తప్పవు. కానీ ఇప్పటికే రవితేజ ‘ఖిలాడి’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’తో ఫిబ్రవరిలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ని, 25న ‘భీమ్లా నాయక్’ను విడుదల చేయాలని మేకర్స్ మొండిగా ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా సినిమాలు ప్రస్తుత పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేసుకోవడం చూస్తూనే ఉన్నాము.
ఖిలాడీ, భీమ్లా నాయక్‌తో పాటు డీజే టిల్లు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి కొన్ని చిన్న సినిమాలు కూడా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ సినిమాలు తెరపైకి వచ్చి టికెట్ కౌంటర్ల వద్ద సత్తా చాటుతాయో లేక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడుదల నుంచి వెనక్కి తగ్గుతాయో చూడాలి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కిక్కా? బ్యాడ్ లక్కా? అన్నది చూడాల్సిందే !
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!