టాలీవుడ్ లో మరో మెగా మల్టీస్టారర్ రాబోతోందా ? అంటే అవుననే అన్పిస్తోంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక మెగా మల్టీస్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘వినోదయ సీతం’ రీమేక్ అని అంటున్నారు.
Read Also : ప్రముఖ దర్శకుల మధ్య వార్… వరుస ట్వీట్లతో రచ్చ
తమిళంలో సముద్రఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటించగా… తెలుగులో పవన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో దర్శకుడిగా వ్యవహరించిన సముద్రఖని ఈ సినిమాకు తెలుగులో కూడా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఆయన మెగా హీరోలు ఇద్దరినీ స్క్రిప్ట్ తో సంప్రదించగా, ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు రూమర్స్ జోరందుకున్నాయి.