“భీమ్లా నాయక్” విడుదలపై ఇప్పుడు మెగా అభిమానుల్లో ఉత్కంఠతను నెలకొంది. ఈ సినిమాకు రెండు విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. అయితే ఏపీ టిక్కెట్ల వివాదంతో పాటు, సీఎంతో సినీ ప్రముఖుల భేటీ తరువాత కొత్త జీవో వస్తే గనుక సినిమాను ఫిబ్రవరి 25నే విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే నిన్న చిరు బృందం ఏపీ సీఎంతో చర్చించి, సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. అంతేకాదు మరో వారం, పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని అన్నారు. దీంతో మెగా అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. సినిమా విడుదల తేదీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘భీమ్లా నాయక్ మేకర్స్ కూడా సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Read Also : No Time to Die : ఓటిటిలో జేమ్స్ బాండ్ మూవీ
ఇదిలా ఉండగా మెగా అభిమానులను ఖుషీ చేసే సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ‘భీమ్లా నాయక్’ను కూడా హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్నీ చిత్రనిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఈ యంగ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ‘భీమ్లా నాయక్’ హిందీలోనూ విడుదల అవుతుందని వెల్లడించారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల కానుంది. ‘భీమ్లా నాయక్’లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్, మురళీ శర్మ, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.