Super Six Super Hit: సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో కూటమి పార్టీ నేతలు కీలక సభ నిర్వహించారు… అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటులో మూడు పార్టీలు నేతలు పాల్గొన్నారు.. కూటమిలో ఐక్యత ఉంది అని చెప్పేందుకు ఈ సభ ఏర్పాటు అయింది అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మూడు పార్టీలు కలిసి అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అయిందని చెప్పడం అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రధాన ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు అయిందనే చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది… దీంతో పాటు కూటమి నేతల మధ్య ఐక్యత ఉంది మూడు పార్టీలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయన్న సంకేతాలు ప్రధానంగా ఇవ్వడం కోసమే… అనంతపురం సభ జరిగింది.. అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కూటమి నేతలు ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.. అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Shivani Nagaram : శివానీ నగరం దెబ్బ.. ఆ ముగ్గురు భామలకు చెమటలు
మూడు పార్టీల మధ్య ఐక్యత కు సంబంధించి ఈ మధ్య కాలంలో రక రకాల అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.. బీజేపీ నేతలు కూటమికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం… ఓట్ల శాతం తక్కువగా ఉందని చిన్నచూపు చూడద్దని వ్యాఖ్యానించడం జరిగాయి. పవన్ కల్యాణ్ కూడా చాలా సందర్భాల్లో. కూటమి 15 ఏళ్లు కలిసి ఉండాలని చెప్తూ ఉన్నారు. అదే విధంగా కింది స్థాయిలో కూటమి నేతల మధ్య ఐక్యత తగ్గిందనే అభిప్రాయం కూడా బలంగా ఉంది.. వీటికి చెక్ పెట్టడం కోసమే ప్రధానంగా అనంతపురం సభ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితేచ అభివృద్ధి ప్రధాన ఎజెండా గా ముందుకు వెళ్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారు.. రంగంలోకి మంత్రి లోకేష్..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.. స్థానిక ఎన్నికలు అంటే కింది స్థాయి క్యాడర్ మధ్య ఐక్యత. సమన్వయం చాలా అవసరం…. వీటిని దృష్టిలో పెట్టుకుని అనంతపురం సభ లో ఒక ఇండికేషన్ ఇచ్చారు. పై స్థాయి లో నేతల మధ్య సమన్వయం ఉందని ఇదే విధంగా కింది స్థాయి లో కూడా ఐక్యత ఉండడం కోసమే ప్రధానంగా సభ జరిగింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….సూపర్ సిక్స్ అమలు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం. ప్రభుత్వ పనితీరు.ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు కూడా వివరించింది..మొత్తానికి అభివృద్ధి ఐక్యత ప్రధానంగా సభ జరిగింది అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.