CM Chandrababu: అసెంబ్లీకి రాకుండా ‘రప్పా.. రప్పా..’ అంటూ బయట రంకెలేస్తున్నారు.. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడున్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. పులివెందుల, ఒంటిమిట్ట జెట్పీటీసీ ఎన్నికల్లో రప్పా రప్పా అని బెండుతీశారని ఎద్దేవా చేశారు.. వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి దగ్గరికి వెళితే ధృతరాష్ట్ర కౌగిలికి బలి అవుతారని హెచ్చరించారు.. ఐదేళ్లు ఆ ధృతరాష్ట్ర కౌగిలిలోనే ఉన్నారు… 2024 ఎన్నికల్లో ప్రజలకు విముక్తి కలిగింది. తెలుగుదేశం ఆవిర్భావంతో సీమ ప్రజల జీవితాల్లో మార్పు మొదలైందన్నారు.. ఇక, సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు నాడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు తెలుగుదేశం హయాంలో వచ్చినవే. సీమ పల్లెల్లో ఫ్యాక్షనిజం అంతం చేసినా… నీళ్లు తెచ్చినా ఆ ఘనత మనదే అన్నారు..
Read Also: Nepal Crisis: నేపాల్‌లో తిరుగుబాటుపై చైనా తొలి ప్రకటన.. పాపం దోస్తును పట్టించుకోలే…!
మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు… నేనేదో పొడిచేశానని మాట్లాడుతున్నాడు.. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ అయిపోదు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం టీడీపీనే అన్నారు చంద్రబాబు.. 17 కాలేజీలు ఉంటే.. ఒక్క కాలేజీ మాత్రమే పూర్తి అయింది. ఫౌండేషన్ వేయడం… రిబ్బన్ కట్ చేయడం… నేనేదో చేశానని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ కి రండి.. మెడికల్ కాలేజీలపై చర్చిద్దాం అని సవాల్ చేశారు.. ఇక, ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు.. అసెంబ్లీకి రాని వాళ్ళు రాజకీయాలకు అర్హుడా..? అని ప్రశ్నించారు.. ఈ ఏడాది రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైనా అన్ని చెరువులకు నీళ్లు వచ్చాయి. మీకు గుర్తుందా… సీమ రాజకీయం మారుతోందని మొన్న ఎన్నికల సభల్లో గట్టిగా చెప్పాను. సీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉంటే 45 చోట్ల కూటమిని గెలిపించి నా నమ్మకాన్ని నిజం చేశారు. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. 15 నెలల పాలనతో సీమలో కూటమి మరింత బలపడింది. ఒకప్పుడు అనంత ఎడారిగా మారే పరిస్థితిలు ఉండేవి. డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులతో ఎడారి నేలకు జీవం పోశాం. కియా కార్ల పరిశ్రమ తెచ్చాం. అనంతను దేశంలో బ్రాండ్ చేశాం. నేడు మళ్లీ సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ అమలు చేస్తున్నాం. రూ. 3850 కోట్లతో హంద్రీ నీవా ద్వారా కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకువెళ్లాం. 5 ఏళ్లు వాళ్లు చేయలేని పనిని 100 రోజుల్లో చేశాం. పత్తికొండ, జీడిపల్లి, పెన్నా అహోబిలం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజులదిన్నె ప్రాజెక్టులు, నింపుతున్నాం. మరోవైపు గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల,కండలేరు నింపుతున్నాం అన్నారు.
Read Also: Nepal: నేపాల్‌లో “రాచరికం” ఎలా ముగిసింది, ప్రజాస్వామ్యంగా ఎలా మారింది..?
రాయల సీమ అంటే తిరుపతి నుంచి శ్రీశైలం వరకు మహా పుణ్యక్షేత్రాలు. అనేక ప్రసిద్ద ఆలయాలు. సమర్థ నీటి నిర్వహణతో సీమకు జలకళ తెచ్చాం. సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం. ఇది మీ CBN మాట అన్నారు సీఎం చంద్రబాబు.. సీమలో డిఫెన్స్, స్పేస్, ఏరో స్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వస్తున్నాయి. సోలార్, విండ్ ఎనర్జీతో ఈ ప్రాంతానికి కొత్త ఎనర్జీ ఇస్తాం. ఇక రాయల సీమ రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ. రోడ్లు, ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు, పరిశ్రమలు, హార్టికల్చర్ సాగుతో రత్నాలసీమ అవుతుంది. ఎవరు అడ్డుపడినా సీమ అభివృద్ది ఆగదు.. ఆగదు. ఇది నా భరోసా అన్నారు సీఎం చంద్రబాబు..