గుంటూరులో మంత్రి రజని కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆఫీస్ మీద రాళ్లు వేసి ఫ్లెక్సీలు చింపివేసి టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఫ్రీ ప్లాన్డ్గా చేసిన చర్య ఇది అంటూ ఆయన ఆరోపించారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి చేయడం హింసను ప్రేరేపించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చంద్రబాబు అన్నారు.
గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాయడంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టిందో విచారణ చేయమని తాము కూడా లెటర్ రాయబోతున్నామన్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామని, ఆ ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామే అని జోగి రమేష్ తెలిపారు. తాడేపల్లిలో మంత్రి…
Shivaji: నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్.. బిగ్ బాస్ సీజన్ 7 కు గేమ్ ఛేంజర్ గా మారిన విషయం తెల్సిందే. చాలావరకు శివాజీనే బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ, చివరకు పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా చేశాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా కొన్నిరోజులు రెస్ట్ తీసుకున్న శివాజీ ఈ మధ్య మీడియా ముందు గట్టిగానే కనిపిస్తున్నాడు.
తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో…
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటును జనసేనకి కేటాయించడం ఖాయమన్న చంటిబాబు.. ఆర్థికంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ తనకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతిపాదన పెట్టారట.. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు జనసేనలో కాకినాడ ఎంపీగా పోటీ చేసేవారు ప్రస్తుతానికి ఎవరూ లేరని.. ఎవరు పోటీ చేసిన బయట నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడం తప్పదని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట..
ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడ్డారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని.. ఈ స్కీం కింద భారీ ఎత్తున.. రూ. 35,141 కోట్ల మేర దోపిడీ జరిగిందన్నారు.
నా రాజకీయ భవిష్యత్తు నాశనం కావడానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణం అన్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వచ్చే ఎన్నికల్లో ఎంవీవీని ఓడించడమే నా లక్ష్యం అన్నారు. సంక్రాంతి పండుగ తరువాత నా సత్తా చూపిస్తాను అంటూ సవాల్ చేశారు.
పవన్ కల్యాణ్‌తో సమావేశంపై అనుచరులతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు.