కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్... రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
మంత్రి ఆర్కే రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అబద్దాలకోరు పార్టీ అని మండిపడ్డారు. ఈరోజు వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. అనంతరం వ్యాఖ్యలు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చే పార్టీని హైదరాబాద్ కు తరిమి కొట్టండని విమర్శించారు. వాళ్లు అందరూ కూడా నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్, లోకేష్ కి ఆంధ్ర ప్రదేశ్ లో సొంత ఇల్లు గానీ,…
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి ఫోకస్ రాజకీయాలమీదనే పెట్టాడు. దీంతో పవన్ నటిస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో హైప్ క్రియేట్ చేసిన సినిమా OG. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Venkat: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగారని విమర్శించారు. రా..కదలి రా.. అంటే రావడం లేదు. ఆంబోతులంటూ తమపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబు స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నాడు.. తాను అలాగే మాట్లాడగలనని తెలిపారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని పేర్కొన్నారు.
Emraan Hashmi: బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ సినిమాలకు ఇమ్రాన్ పెట్టింది పేరు. ఇక ఈ హీరో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలకు.. హిందీ విలన్స్ ఎక్కువ అయ్యారు. ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో విలన్ గా పెడుతున్నారు.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు అంశాలు పరిశీలించాలంటూ పవన్ కల్యాణ్కు సూచించారు హరిరామ జోగయ్య.. సీఎం వైఎస్ జగన్ను ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలన్నారు.
Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.