TDP-Janasena Alliance: ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు చేస్తున్నారు.
Also Read: Prasad Raju: మూడు రాజ్యసభ స్థానాలు మాకే వస్తాయి: చీఫ్ విప్ ప్రసాద్ రాజు
Also Read
గత 4 రోజులుగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడివిడిగా కసరత్తు చేశారు. జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే బాబు-పవన్ ఓ అవగాహనకు వచ్చారట. జనసేనకు 25 స్థానాలు ఇస్తామని చంద్రబాబు అంటుండగా.. ఎక్కువ స్థానాలు కావాలని పవన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లను జనసేనాని ఆశిస్తున్నారట. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పవన్ పట్టుబడుతున్నారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తు జరుగుతుండగా.. ఒకట్రెండు రోజుల్లో టీడీపీ-జనసేన క్లారిటీకి రానుందట. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!