ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సడన్ గా భారీ సినిమాలని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ హౌజ్ అయిపొయింది. ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న ఈ బ్యానర్ కొత్తగా ‘హంగ్రీ చీతా’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించిందని సమాచారం. డీవీవీ దానయ్య రిజిస్టర్ చేయించిన టైటిల్ ఎవరి కోసం అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పొలిటికల్ సీజన్ కారణంగా షూటింగ్ బ్రేక్ లో ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి మేకర్స్ ఆల్రెడీ ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు.
మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ కి కూడా ఇదే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ గ్లిమ్ప్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో హంగ్రీ చీతా అనే వర్డ్ చాలా ఫేమస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పాత సినిమాల వీడియోలకి కూడా హంగ్రీ చీతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టుకోని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసారు. ఇలాంటి సమయంలో దానయ్య ఇదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడం హాట్ టాపిక్ అయ్యింది. ‘దే కాల్ హిమ్ ఓజీ’ టైటిల్ ని మార్చి హంగ్రీ చీతా అని ఫిక్స్ చేస్తున్నారా లేక వేరే హీరో కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కోసమే అయితే పాన్ ఇండియా మార్కెట్ కి సెట్ అయ్యే ఒకటే టైటిల్ దొరికేసినట్లే… లేదు వేరే హీరో కోసం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చే ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.