ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
Read Also: Ambati Rambabu: సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో.. చంద్రబాబు-పవన్ భేటీపై సెటైర్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి చెల్లుబోయిన వేణు మండిపడ్డారు. చిరంజీవి పార్టీ పెట్టి తన వల్ల కాదని మూసేశాడని.. అన్నయ్య మూసేస్తే 2012లో తమ్ముడు వచ్చాడని విమర్శించారు మంత్రి వేణు. 2014లో ఓటమిని ఎన్నికల ముందే ఒప్పుకుని.. పోటీ నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నాడని అన్నారు. 2014లో జగన్ ఓడిపోయిన ధైర్యంగా నిలబడ్డారని.. 2019లో 151 స్థానాల్లో గెలిచి చూపించాడని మంత్రి వేణు పేర్కొన్నారు.
Read Also: Black : థియేటర్స్ లో రిలీజ్ అయిన 19 ఏళ్లకు ఓటీటీలోకి వచ్చిన అమితాబ్ ‘బ్లాక్’ మూవీ..