కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తాజా పరిణామం ఇది.
ముద్రగడతో టచ్‌లోకి వెళ్లారు జనసేన పార్టీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్‌తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ.. జనసేన నేతలతో ఏకాంత చర్యలు జరిపినట్టు తెలుస్తోంది.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అంబటి రాయుడికి పవన్ కళ్యాణ్ వినాయకుడి వెండి ప్రతిమను బహూకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశం వివరాల గురించి అంబటి రాయుడు తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో తెలిపారు.
కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్... రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
మంత్రి ఆర్కే రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అబద్దాలకోరు పార్టీ అని మండిపడ్డారు. ఈరోజు వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. అనంతరం వ్యాఖ్యలు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చే పార్టీని హైదరాబాద్ కు తరిమి కొట్టండని విమర్శించారు. వాళ్లు అందరూ కూడా నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్, లోకేష్ కి ఆంధ్ర ప్రదేశ్ లో సొంత ఇల్లు గానీ,…