MP Balasouri: రేపు అనగా ఆదివారం రోజు నేను జనసేన పార్టీలో అధికారికంగా చేరబోతున్నాను అని ప్రకటించారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి… వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడుగా రాజకీయ జీవితం ప్రారంభించిన నేను.. ప్రజాప్రతినిధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించానని అన్నారు.. రాష్ట్ర అభివృద్ధి కుంటు పడటంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కి జీవనాధారం అయిన పోలవరం నిర్మాణాన్ని ఆటకెక్కించడం వంటి విషయాలు తనను బాధపెట్టాయని, అందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నానని పేర్కొన్నారు. రేపు అధికారికంగా జనసేనలో చేరుతున్నానని, తన రాజకీయ జీవితాన్ని పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు ఎంపీ బాలశౌరి.
Read Also: Jairam Ramesh: 2002లో నరేంద్రమోడీని అద్వానీ కాపాడారు..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడుగా 2004లో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను.. పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.. అయితే, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు దూరం అవ్వాల్సి వచ్చిందన్నారు. 2019లో వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచాను.. మచిలీపట్నం అభివృద్ధికి నా సాయి శక్తుల కృషి చేశానని గుర్తుచేసుకున్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వంలో డెల్టా ప్రాంతానికి జీవనాధారమైన పోలవరం నిర్మాణం అటకెక్కింది.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. అందుకే వైసీపీ నుంచి బయటికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇక, పవన్ కల్యాణ్‌తో భేటీ తర్వాత జనసేనపై, పవన్‌పై ఒక మంచి అభిప్రాయం వచ్చింది.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పవన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని.. ఏపీ అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళిక కూడా అద్భుతంగా ఉందని.. అందుకే పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రయాణం సాగించాలని నిర్ణయించునున్నారు.. రేపు జనసేనలో చేరుతున్నానని ప్రకటించారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. కాగా, ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి.. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపారు.. ఆ తర్వాత జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న విషయం విదితమే.