Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్న చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రుల తరువాత అన్నావదినలే నన్ను తల్లిదండ్రులుగాపెంచారు అని పవన్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇక చిన్నతనం నుంచి పవన్ ఇంట్రోవర్ట్ గా పెరిగాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు.. చదువు కూడా అంతంత మాత్రమే.
మరోసారి పవన్ కల్యాణ్‌కు సవాల్ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ నుంచి నాపై పోటీ చేయమని గతంలోనే పవన్ కి సవాలు చేశాను.. కనీసం గ్లాస్ గుర్తు అయినా నా మీద పోటీ పెట్టమని కోరుతున్నాను అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ ఎన్ని రివ్యూలు చేసుకున్న ఓడిస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేనలో కీలక బాధ్యతలను అప్పగించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ యాదవ్‌ను పవన్ కళ్యాణ్ నియమించారు. వంశీ నియామకాన్ని ఖరారు చేస్తూ జనసేన అధికారిక ప్రకటన చేసింది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రిక అందించారు.
ఎన్నికల వేళ టీడీపీ- జనసేన మళ్లీ కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారన్నారు.
గత వారంలో మూడు రోజులు కాకినాడ లోనే ఉన్న పవన్ కల్యాణ్.. కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు.. కాకినాడ సిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు సేనాని.. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు మొత్తం 50 డివిజన్ లలో 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా.. సీఎంగా వైఎస్ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి "రా కదలి రా!" పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు..