చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: AP Assembly: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
సీట్ల సర్దుబాటుకు సంబంధించి గత కొంతకాలంగా ఇరువురి మధ్య చర్చలు జరిపారు. కాగా.. ఈ సమావేశంలో జనసేనకు 25-30 స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. జనసేనకు ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని.. తమ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నట్లు పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. గతంతో పోల్చుకుంటే.. పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ఆశావహులు సిద్ధమవుతున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 శాతం షేర్ ఉండాలని జనసేన చెబుతుంది. అంతేకాకుండా.. అటు విశాఖపట్నంలో కూడా పార్టీ బలంగా ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై ప్రకటన అనేది ఈ సమావేశంలో క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.
Read Also: Candida Auris: అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్..