మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. ఈ ప్రజాస్వామ్యంలో దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది.. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అందుకే రాష్ట్రంలో కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరికిందని చెప్పారు. బందర్ పోర్ట్ రావడానికి తన వంతు కృషి చేశానని.. బందరులో మెడికల్ కాలేజీకి నిధులు తెప్పించగలిగానన్నారు. గుడివాడ పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న రైలు గేటు వ్యవహారాన్ని పరిష్కరించ గలిగానని ఎంపీ బాలశౌరి తెలిపారు.
Read Also: MP Balashowry: జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి.. పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఎదురుమండి ప్రాంతానికి ఇప్పటికీ బాటలేదని ఎంపీ బాలశౌరి చెప్పారు. అలాంటి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేయాలని తాను ప్రయత్నం చేస్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు రావడం లేదని పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అబద్ధాలు చెప్పను అని చెప్తుంటాడు.. అదే ఓ పెద్ద అబద్ధం అని విమర్శించారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి ఆంధ్రా రాజధాని అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. సీఎం అయిన తర్వాత చేస్తుంది ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు.. సిద్ధమని పెద్దపెద్ద ఫ్లెక్సీలు వేయిస్తున్నారు.. పారిపోవడానికి సిద్ధం అని అనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలను, అక్రమాలను జనసైనికులు వేటాడతారని తెలిపారు. పవన్ నాయకత్వ లో జనసేన నాయకులు వేటాడుతారని అన్నారు.
Read Also: PM Modi: గత పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం దేశ చరిత్రను నిర్లక్ష్యం చేశారు..