PM Modi Vizag Tour: విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ప్రధాని పాల్గొనే బహిరంగసభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.. ఈ పర్యటనలో 2.08 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని.. NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్, రైల్వేజోన్, క్రిస్ సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.. సభకు భారీ ఏర్పాట్లు చేశారు కూటమి పార్టీలు.. ఇక, ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.. ప్రధాని బహిరంగ సభ వేదికపై 13 మందికే అవకాశం కల్పించనున్నారు.. ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు పార్టీ అధ్యక్షులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఛాన్స్ ఇవ్వనున్నారు.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, ఎంపీలు ఎం.శ్రీభరత్, సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వేదికపై కూర్చొనే అవకాశం ఉంది..
Read Also: K Laxman: ప్రధాని మోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో రోడ్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.. మరి కొన్ని గంటల్లో ప్రధాని మోడీ రోడ్ షో ప్రారంభం కానుంది… ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికేందుకు కూటమి నాయకులు భారీగా ఏర్పాటు చేశారు.. మోడీ పర్యటనలో రోడ్డు షో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.. సుమారు లక్షమంది తో ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దాదాపు 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది.. ఓపెన్ టాప్ వెహికల్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు.. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు సుమారు కిలో మైటర్ పైన ర్యాలీ జరగనుంది.. ఇప్పటికే ఆంధ్రా యూనివర్శిటీ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకుంది SPG… 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 32 మంది IPS అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 4 వందల మంది ఎస్సైలు భద్రతా విధుల్లో ఉంటారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వామపక్ష కార్మిక సంఘాలకు చెందిన పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేసిన విషయం విదితమే..