PM Modi Vizag Tour: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. విశాఖలో రేపు జరగబోయే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది.. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్ల్ నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు.. ఈ నేఫథ్యంలో సభా ప్రాంగణంలో 5000 మంది పోలీసులు చేరుకుంటున్నారు… 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.. సిరిపురం దత్ ఐ ల్యాండ్ నుండి సభా ప్రాంగణం వరకు సుమారు 1.5 కిలో మీటర్ల రోడ్ షో జరగనుంది.. ఈ రోడ్ షో 45 నిముషాల పాటు కొనసాగనుంది. సభా ప్రాంగణం దగ్గరే కావడంతో ప్రజలకు అభివాధం చేస్తూ రోడ్ షో నెమ్మదిగా సాగనుంది.. రోడ్ షో లో మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనున్నారు.. ఉత్తరాంధ జిల్లాల నుండి సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు..
Read Also: Oscars 2025 Nominations : ఆస్కార్ బరిలో సూర్య కంగువా
విశాఖలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ సభకు, రోడ్ షో కు చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లో నిమగ్నమయ్యారు అధికారులు.. మరో వైపు కూటమి నాయకులు వరుస సమీక్షలు నిర్వహిస్తు బిజీ బిజీగా కనిపిస్తున్నారు… రేపు సుమారు మూడు లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా ప్లానింగ్ చేస్తున్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజల తరలింపుకు సుమారు 7000 వాహనాల కేటాయించారు.. సభకు హాజరయ్యే ప్రజల కోసం సుమారు 3 లక్షల ఆహార పొట్లాలు సిద్ధం చేయనున్నారు.. ప్రధాని టూర్ దృష్ట్యా రేపు ఉమ్మడి విశాఖలో పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. రూట్, రోప్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, డామినేషన్ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాట్లు ట్రైల్ రన్స్ జరుగుతున్నాయి..
Read Also: Kadambari Jatwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు..
ఇక, ఏయూ గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించారు హోం మంత్రి వంగలపూడి అనిత. పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.. ప్రధాని మోడీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తుందని.. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ శంకస్థాపన చేస్తారు.. ప్రధాని మోడీ ప్రత్యేకమైన ధన్యవాలు తెలిపారు అనిత.. ప్రజలు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. 2019 నుండి 2024 వరకు పాయకరావుపేటలో ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు బల్స్ డ్రగ్ పార్క్, స్టీల్ ఫ్లాంట్ రాబోతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని వివరించారు వంగలపూడి అనిత..