ప్రధాని మోడీ విశాఖకు రానున్నారు. ఎయిర్‌పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్వాగతం పలికారు. సాయంత్రం 4:45 గంటల నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ప్రధాని మోడీ రోడ్ షో జరగనుంది. ఈ రోడ్ షోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Rajini Kanth : ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న సూపర్ స్టార్
ఇదిలా ఉంటే విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా విశాఖ నుంచి వర్చువల్‌గా అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.2లక్షల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు విశాఖలో 3 గంటల పాటు ప్రధాని మోడీ పర్యటన ఉండనుంది. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు మోడీ వెళ్లనున్నారు.