AP Government: కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో వెలుగు చూసిన ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. భారత్‌లో అధికారికంగా HMPV మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. గైడ్‌లైన్స్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్ళపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్ధేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు..
Read Also: Mahesh Babu : సోనూసూద్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్
మరోవైపు.. HMPV వైరస్ పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. విశాఖ నుంచి నిపుణులైన వైద్యులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. కర్ణాటకలో నమోదైన HMPV కేసులపై అప్రమత్తం అయ్యాం.. HMPV పై అలార్మింగ్ వాతావరణం లేదు.. సాధారణ ఫ్లూ లక్షణాలతో ఇబ్బంది పెడుతుంది.. మరణాలు కూడా నమోదైన సమాచారం లేదన్నారు.. వైద్యశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాటు చేస్తున్నాం.. ప్రతీ హాస్పిటల్ లో 20 బెడ్స్ ను HMPV కోసం ఐసోలేట్ చేయమని ఆదేశించాం అన్నారు.. HMPV పై SOP విడుదల చేస్తున్నాం.. ICMR ఇప్పటివరకు జనరల్ అడ్వైజరీ మాత్రమే ఇచ్చింది.. పెద్దగా ఆందోళన అవసరం లేదు, ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అయినా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్..