రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి
వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పరిష్కారంలో జాప్యం పై అసహనం వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు మరింతగా ప్రోత్సహించాలన్నారు. ట్రేడర్లు రైతుల వద్దకు వెళ్ళి కొనేలా రాష్ట్రంలో 3 ఆధునిక మార్కెట్లను అధునాతన హంగులతో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.
గర్ల్‌ఫ్రెండ్ ఎల్లాను పెళ్లాడిన చెస్ ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్!
చెస్ ప్రపంచ నంబర్‌వన్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ఎల్లా విక్టోరియా మలోన్‌ను పెళ్లాడాడు. ఓస్లోలోని మంచు కొండలలోని హోల్‌మెన్‌కొల్లెన్ చాపెల్‌లో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య కార్ల్‌సన్, ఎల్లా వివాహం ఘనంగా జరిగింది. అనంతరం ఓస్లోలోని 5-స్టార్ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన వివాహ విందుకు ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు.
అత్యాచార దోషి ఆశారాం బాపుకి మధ్యంతర బెయిల్
2013 అత్యాచారం కేసులో జీవిత శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపుకు వైద్యపరమైన కారణాలతో మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆశారాం బాపు గుండె జబ్బుతో పాటు వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం ఆశారం బాపు జోధ్‌పూర్‌లోని ఆరోగ్య వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే…పునాదులు కూడా మిగలవు!
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడం పట్ల బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు, వృద్ధులకు రాళ్లు తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేదో తెలియదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని సూచించారు.”తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే.. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందే.. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తే.. ఊరుకునేది లేదు. తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి.” అని సంజయ్ తెలిపారు.
కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
ఫార్ములా ఈ రేసు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేటీఆర్ క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. “ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. మా వాదన కూడా వినాలి”అని కేవియట్ పిటిషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా.. హై కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేయడంతో టెన్షన్ పెరిగింది. దీంతో నంది నగర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి లీగల్ టీమ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హై కోర్టు ఫుల్ బెంచ్ వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అనే దానిపై సమాలోచనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం.. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయి.. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందన్నారు. అతి త్వరలో ఒక బిలియన్ ఓటర్లకు చేరుకుంటామన్నారు. అందులో మహిళా ఓటర్లు 48 కోట్లకు పైగా ఉన్నారు. ఇక, ఓట్ల తొలగింపు ఆరోపణలను సైతం ఖండించారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
వైసీపీపై పురంధేశ్వరి చేసిన ఆరోపణలు అర్ధ రహితం..
హైందవ శంఖారావం సభలో పెద్ద ఎత్తున హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదని.. కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం తమ పార్టీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్లు ఆరోపణలు చేయటం తగదన్నారు.
రేపు మధ్యాహ్నం విశాఖకు చంద్రబాబు, పవన్ కల్యాణ్..
భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది.. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్లో నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు.. ఈ నేఫథ్యంలో సభా ప్రాంగణంలో 5000 మంది పోలీసులు చేరుకుంటున్నారు… 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.. ఇక, ప్రధాని మోడీ కంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని మోడీకి స్వాగతం పలికి.. ఆ తర్వాత రోడ్‌షోలో పాల్గొనబోతున్నారు..
కుప్పం అభివృద్ధికి ‘జననాయకుడు’ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాం..
చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ వెబ్సైట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్నీ ప్రత్యేక జీవో ద్వారా ఎత్తేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పంలో జరిగిన గ్రానైట్ అక్రమాలపై దర్యాప్తు చేస్తామని అన్నారు. కోటి సభ్యత్వ నమోదు జరగడం ఒక చరిత్ర.. దేశంలో ఏ పార్టీకి ఇలాంటి ఘనత లేదని పేర్కొ్న్నారు. గోదావరి-బనకచర్ల అనుసంధానం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను అనారోగ్య ప్రదేశ్‌గా మార్చేస్తున్నారు..
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆశయంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పరిధి పెంచాం.. ఐదు లక్షల నుండి 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని చెప్పారు. ఒక సీఎంకి ఏ స్థాయి వైద్యం అందుతుందో.. అదే వైద్యం పేదలకు అందాలన్నది వైఎస్ కుటుంబ లక్ష్యం అని విడదల రజని తెలిపారు. పేద వారికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా.. గత ప్రభుత్వంలో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఈరోజు అనారోగ్య ప్రదేశ్‌గా మార్చేస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన వెంటనే, ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరంగా కొనసాగించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రీన్‌కో సంస్థ , దాని అనుబంధ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. తోడుగా, నిందితుల ఇళ్లపై సోదాలు చేపట్టేందుకు కోర్టు నుండి సెర్చ్ వారెంట్‌ను కూడా పొందింది. అయితే.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆర్డర్ కాపీ సిద్ధమైంది. ఈ ఆర్డర్ కాపీలో జడ్జి లక్ష్మణ్ సంచలన అంశాలు ప్రస్తావించారు. HMDA పరిధికి మించి డబ్బు బదిలీ జరిగిందని హైకోర్టు వెల్లడించింది.. అయితే.. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని హైకోర్టు సూచించింది.