కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఏపీలో పర్యటించనున్నారు. శనివారం రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి విజయవాడలోని హోటల్‌కు చేరుకుని బస చేస్తారు.
ఇది కూడా చదవండి: Thug Life: థగ్ లైఫ్ కోసం ఇంత పెట్టడానికి రెడీ అయ్యారా?
ఇక ఆదివారం గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇదిలా ఉంటే అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గన్నవరం నుంచి ఉండవల్లి వరకు పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు.
ఇది కూడా చదవండి: AV Ranganath : ప్రమాదంపై క్షణాల్లో సమాచారం చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకోవాలి