Off The Record: బీజేపీ వైపు మెగాస్టార్ అడుగులు..? డిసైడయ్యారా..? కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..?
- చిరంజీవి కాషాయం కప్పుకోవడం ఖాయమైందా?
- మెగాస్టార్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయా?.
- ఇటీవల బీజేపీ కార్యక్రమాల్లో కనిపిస్తున్న చిరంజీవి..
- రెండు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో చిరు చర్చ..
- కాషాయ కండువా ఖాయమని జోరుగా ప్రచారం..
- చిరంజీవి రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ చిరంజీవి ఇప్పుడు వేస్తున్న పొలిటికల్ స్టెప్స్‌కు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాశీకి వెళ్ళకున్నా… కాషాయం కప్పుకోవడం మాత్రం దాదాపు ఖాయమని అంటున్నారు. కాకుంటే… ఇది రాజకీయ కాషాయం. ఇక వారణాసిలో బతకకున్నా… తన రాజకీయ వరస మాత్రం మార్చుకోబోతున్నారట. గడిచిన కొద్ది రోజులుగా మెగాస్టార్ వేస్తున్న అడుగులు చూస్తుంటే… అవి బీజేపీ వైపునకు పడుతున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. తమ్ముడు పొత్తు కుదుర్చుకున్న పార్టీతో దోస్తానీ వెనక అసలు కథేంటన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఈ మధ్య కాలంలో ఎక్కడా బహిరంగంగా రాజకీయాలు మాట్లాడకున్నా… బీజేపీ నిర్వహించే కార్యక్రమాలన్నిటిలో పాల్గొనడం చూస్తుంటే… పొలిటికల్ రీ ఎంట్రీ దిశగా చిరంజీవి ఒక లైన్ తీసుకున్నట్టు కనబడుతోందని అంటున్నారు పరిశీలకులు.
Read Also: H-1B Visas: అమెరికన్ ఉద్యోగులకు హెచ్-1బీ వీసా ముప్పు.. చట్ట సవరణకు ప్రతిపాదన
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
సొంత పార్టీ పెట్టుకుని చేరుకోలేని లక్ష్యాన్ని తమ్ముడితో పొత్తున్న పార్టీలో చేరి సాధించాలని చిరంజీవి అనుకుంటున్నారా అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హాట్. అదీకూడా అలా ఇలా కాదు. యమయమా హాట్‌హాట్‌గా నడుస్తోందట. ఇటీవల బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చిరంజీవి హాజరవడం, అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పొత్తున్న పవన్‌తో పాటు చిరంజీవితో కూడా సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తుండటంతో… ఇక మెగాస్టార్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న ప్రచారానికి ఊతమిచ్చినట్టు అవుతోందని అంటున్నారు. తన సొంత పార్టీ పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశాక ఆ పార్టీ తరపున కేంద్ర మంత్రి అయ్యారు చిరంజీవి. ఇక కాంగ్రెస్ అధికారం నుంచి దూరమవగానే.. ఆయన కూడా దశలవారీగా దూరమవుతూ వచ్చారు. ఇటీవలి కాలంలో అయితే… అసలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం గాని.. ఆ పార్టీ కూడా ఆయన్ని పిలిచిన దాఖలాలు గాని లేవు. పవన్ కళ్యాణ్ ఏపీలో యాక్టివ్ అయ్యాక కాంగ్రెస్ కూడా చిరంజీవిని పెద్దగా రాజకీయ కార్యక్రమాలకు ఆహ్వానించింది లేదు. ఇక పవన్ కూటమిలో భాగస్వామి అయ్యాక కాంగ్రెస్ వైపు చూడటం పూర్తిగా మానేశారట చిరంజీవి. కొన్నాళ్లు సినిమాలపై దృష్టి పెట్టిన మెగాస్టార్ ఇప్పుడు తిరిగి పాలిటిక్స్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
Read Also: Pushpa -2 : నేటి నుంచి థియేటర్లలో పుష్ప- 2 రీలోడెడ్ వెర్షన్
అయితే… ఇది ఎప్పుడు? ఎలా ఉంటుందన్న విషయంలో మాత్రం ఇప్పటికింకా క్లారిటీ లేదట. కానీ… తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి అండగా ఉంటానని సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పకనే చెబుతున్నారు చిరంజీవి. అందుకే ఏపీ పాలిటిక్స్ లో అన్నదమ్ములిద్దరూ ఒకే వేదిక మీద ఉంటారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. సాధారణంగా చాలా దూరపు ఆలోచనతోనే ఇలాంటి ఎత్తుగడను అమలు చేస్తూ ఉంటుంది ఆ పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ మీద పట్టు బిగించాలని టార్గెట్ పెట్టుకున్నారట కమలనాధులు. అందుకు మెగా బ్రదర్స్‌ని ఉపయోగించుకునే ఆలోచన ఉందని, ఆ క్రమంలోనే చిరంజీవి ప్రస్తావన తెస్తున్నట్టు కనబడుతోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. సమయం, సందర్భాన్ని బట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం సూచిస్తే… ఆయన తెలంగాణలో కూడా ప్రచారం చేసే అవకాశాలే ఎక్కువ. ఇక చిరంజీవిని కూడా దగ్గరకు తీస్తే…. బ్రదర్స్ ఇద్దరితో తెలంగాణలో రాజకీయం చేయవచ్చని అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా…. మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. రావడం అంటూ జరిగితే అది ఖచ్చితంగా బీజేపీ నుంచేనన్నది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. దీనికి ఆయన వైపు నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఈ ప్రచారాన్ని కొన్నాళ్ళ పాటు చిరంజీవి కూడా ఎంజాయ్ చేస్తారా..? లేక తన ఉద్దేశ్యం ఏంటో చెప్పి ఫుల్ స్టాప్ పెడతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..