Delhi Metro: ఢిల్లీ మెట్రో సరికొత్త రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మెట్రో (Delhi Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో చరిత్రలోనే ఇదొక సరికొత్త అధ్యాయం. మంగళవారం మెట్రో స్టేషనలన్నీ జాతరను తలపించాయి. ఇసుకేస్తే రాలనంత జనం. నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో హస్తిన వాసులు ప్రయాణం చేశారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనతో అట్టుడుకుతోంది. వేలాది మంది అన్నదాతలు హస్తినకు తరలివచ్చారు. దీంతో సరిహద్దులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ముందుకు కదిలే పరిస్థితులు లేవు. ఉద్యోగస్తులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎటు చూసినా భద్రతా బలగాలు మోహరించాయి. రోడ్లన్నీ మూసివేశారు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి 13న అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ క్రమంలో రైతులతో పాటు ప్రజలు సమయాన్ని ఆదా చేయడానికి ప్రజలంతా మెట్రో రైలును ఆశ్రయించారు. దీంతో స్టేషన్‌లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. ఆ విషయాన్ని తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC) ఓ ట్వీట్ ద్వారా తెలిపింది.
Also Read
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఫిబ్రవరి 13న (మంగళవారం) దాదాపు 71.09 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారని డీఎంఆర్‌సీ గణాంకాలను విడుదల చేసింది. ఇంతకు ముందు సెప్టెంబర్ 2023లో ఢిల్లీ మెట్రోలో 71.03 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగా.. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసినట్లు DMRC సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా పంచుకుంది.
Delhi Metro broke its highest Passenger journeys record set in September 2023 by registering an unmatched 71.09 lakh passenger journeys on Tuesday (February 13, 2024), the highest ever daily passenger journeys. pic.twitter.com/xgtuEUS0dI
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) February 14, 2024
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!