లతం ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో 50 మంది గాయాల పాలయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విమానంలో ఒడిదుడుకులు ఏర్పడడంతో ప్యాసింజర్స్ విమానం పైకప్పుకు తగిలినట్లుగా సమాచారం. దీంతో దెబ్బలు తగిలి రక్తం అంటుకుంది. ప్రమాదంలో జరిగిన సమయంలో ప్రయాణికులు కూడా సీటు బెల్టు పెట్టుకోలేదని తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఆక్లాండ్‌కు బోయింగ్ 787-9 విమానం వెళ్తోంది. గగనతలంలో ఉండగా విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో యాభై మంది గాయపడ్డారు. ఈ విమానాన్ని చిలీ ఎయిర్‌లైన్ లాటమ్ సంస్థ నడుపుతోంది.
విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని.. దీని వల్లే విమానంలో బలమైన కదలిక ఏర్పడిందని విమాన సంస్థ తెలిపింది. విమానం అకస్మాత్తుగా ఎత్తును కోల్పోవడంతో కొంతమంది ప్రయాణీకులు, సిబ్బంది పైకప్పులోకి విసిరివేయబడ్డారని పేర్కొంది. గాయపడిన వారిలో ముగ్గురు సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. అనంతరం విమానం ఆక్లాండ్‌లో విజయవంతంగా ల్యాండ్ అయిందని వెల్లడించింది.
విమానంలో ఏదైనా టెక్నికల్ సమస్య తలెత్తిందా? అన్న విషయం మాత్రం ఎయిర్‌లైన్స్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రయాణికులు మాత్రం ఎక్కువ మందే గాయపడినట్లుగా ప్యాసింజర్ ఒకరు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు సీటుబెల్ట్ ధరించలేదని తెలిపాడు.
ఇక ప్రమాదం జరిగిన సమయంలో విమాన పైకప్పు తగిలి రక్తం అంటుకుందని ప్రయాణికురాలు తెలిపింది. ఇదిలా ఉంటే లతం ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాల్లో గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎదురైనట్లు తెలుస్తోంది. ఆక్లాండ్ మార్గంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.