లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భారతదేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సిస్టమ్‌ను బిగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
BRS Parliamentary Party: ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకు సభ జరగనుంది.
New criminal laws: కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లులను ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. ఇకపై మూకదాడికి పాల్పడిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉందని చెప్పారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.
మిగిలింది ఆరు నేలలు మాత్రమే.. అందుకే విభజన హామీలు పూర్తి చేయాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. పోలవరం పూర్తి చెయ్యాలి.. రాష్ట్ర రాజధాని లేకుండా ఉంది.. పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడ్డ క్యాపిటల్ ను మారుస్తున్నారు.. ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాలి అని ఆయన కోరారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు వచ్చారు. అయితే, ఢిల్లీలో పొగ మంచు కారణంగా విమానాల దారి మళ్లింపుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కాలేకపోయారు.
డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. 19 రోజుల్లో 15 సిట్టింగుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
రేపు (మంగళవారం) ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు జరగనున్న.. మంత్రి మండలి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు.
Parliament's Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, క్రిస్మస్కి ఒక రోజు ముందు ఈ సమావేశాలు ముగియవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు తర్వాత కొన్ని రోజులకు పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.
Asaduddin Owaisi: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఇది కేవలం "సవర్ణ మహిళల"(అగ్రకుల మహిళలు) కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఓబీసీ మహిళలకు, మహిళా కోటాలో రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. మహిళా బిల్లును ‘‘చెక్ బౌన్స్ బిల్లు’’, ‘‘ఓబీసీ, ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లు’’గా విమర్శించారు.