వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. జూలై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేవాలు నిర్వహించాలని సిఫార్సు చేసింది పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ.. కాగా, కరోనా మహమ్మారి విజృంభణతో పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడూ పూర్తిస్థాయిలో నిర్వహించిలేదు.. పార్లమెంట్ సిబ్బంది, ఎంపీలు చాలా మంది కోవిడ్ బారినపడడంతో.. అర్థాతంగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై విమర్శలు చేశాయి…