Akhilesh Yadav : లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీక్ విషయంలో అఖిలేష్ మాట్లాడుతూ.. ఎవరికీ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేపర్ లీక్ చేస్తుందన్నారు. అలాగే, ఈవీఎంల విషయంలో మేం ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అఖిలేష్ అన్నారు. అగ్నివీర్ పథకం రద్దుపై అఖిలేష్ మరోసారి మాట్లాడారు. మంగళవారం…
Parliament: రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి లోక్‌సభ సమావేశాల్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
ప్రతిపక్షాలు మాత్రం ‘నీట్’ అవకతవకలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ నీట్ వ్యవహారంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ నేత మానిక్క ఠాగూర్ ఈ తీర్మానాన్ని ఇచ్చారు. పరీక్షా నిర్వహణలో ఎన్టీఏ విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
President Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం లోక్‌సభ, రాజ్యసభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ‘18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
లోక్సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కంగనా రనౌత్ వార్తల్లో నిలుస్తోంది. హిమాచల్‌లోని మండి స్థానం నుంచి ఆమె గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయన ఇప్పుడు లోక్‌సభ సభ్యుడు. బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక కావడంతో ఎంపీలంతా లోక్ సభకు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్ సభకు చేరుకోగానే మీడియా కెమెరాలు ఆమె వైపు తిరిగాయి
18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. అయితే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి రాజకీయాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోవాలని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు కూడా స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టాయి.
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఎన్నికైన ఎంపీలతో పార్లమెంట్ పరిసరాలు ఉల్లాసంగా కనిపించాయి. ఒకరికొకరు పలకరించుకుంటూ సందడిగా కనిపించింది.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూలై 22 నుంచి పార్లమెంట్ సమవేశాలు జరగనున్నట్లు సమచారం.
PM Modi: పార్లమెంట్ క్యాంటీన్లో ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ లంచ్ చేశారు. సడెన్‌గా ప్రధాని తమతో లంచ్ చేయడంతో సదరు ఎంపీలు షాకయ్యారు. శుక్రవారం తన తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రధాని భోజనం చేశారు. పలు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలను ప్రధాని లంచ్‌కి ఆహ్వానించారు. పార్లమెంట్ క్యాంటీన్లో తనతో కలిసి భోజనానికి రావాల్సిందిగా ప్రధాని వారిని అడిగారు. ‘‘మిమ్మల్ని నేను అస్సలు శిక్షించను, నాతో రండి’’ అని ఎంపీలతో ప్రధాని…