కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పార్లమెంటు లైబ్రరీ భవన్‌లో అఖిల పక్ష సమావేశం జరిగింది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దాదాపు 19 రోజుల పాటు ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు వచ్చారు. అయితే, ఢిల్లీలో పొగ మంచు కారణంగా విమానాల దారి మళ్లింపుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కాలేకపోయారు.
Read Also: Amanchi Krishna Mohan: పవన్‌ను టార్గెట్ చేసిన ఆమంచి.. టీడీపీ-జనసేన పొత్తుపై నిజాలు బయటపెడతా…!
ఇక, తెలుగు దేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ముగ్గురు ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లు, ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులతో పాటు మరి కొన్ని ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది. అలాగే, సభ సజావుగా సాగేలా, బిల్లుల ఆమోదానికి అన్ని పార్టీలు సహకారించాలని నేతలను ఈ సందర్భంగా ప్రభుత్వం కోరినట్లు టాక్.
Read Also: Nagarjuna Sagar: మా విధులు అడ్డుకున్నారు.. ఏపీ లో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు..!
అలాగే, పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను సభ ముందుకు తీసుకు వస్తున్నట్లు ఈ భేటీ చర్చించినట్లు తెలుస్తుంది. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మరో ఏడు కొత్త బిల్లులను ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.