PM Modi: పార్లమెంట్ క్యాంటీన్‌లో ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ లంచ్ చేశారు. సడెన్‌గా ప్రధాని తమతో లంచ్ చేయడంతో సదరు ఎంపీలు షాకయ్యారు. శుక్రవారం తన తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రధాని భోజనం చేశారు. పలు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలను ప్రధాని లంచ్‌కి ఆహ్వానించారు. పార్లమెంట్ క్యాంటీన్‌లో తనతో కలిసి భోజనానికి రావాల్సిందిగా ప్రధాని వారిని అడిగారు. ‘‘మిమ్మల్ని నేను అస్సలు శిక్షించను, నాతో రండి’’ అని ఎంపీలతో ప్రధాని చమత్కరించినట్లు సమాచారం.
Read Also: Pakistan elections: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కొడుకు ఓటమి.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలుపు..
శాఖాహార భోజనంలో రైస్, దాల్, ఖిచ్డీ, టిల్ కా లడ్డూ వంటివి ఉన్నాయి. ప్రధానితో లంచ్ చేసిన వారిలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ నుంచి రితేష్ పాండే, బీజేపీ పార్టీ నుంచి లడఖ్ ఎంపీ జమ్యాంగ్ నమ్గ్యాల్, హీనా గవిత్ కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, బీజేడీ నుంచి సస్మిత్ పాత్ర ఉన్నారు.
45 నిమిషాల పాటు ప్రధాని మోడీ ఎంపీలతో ముచ్చటించారు. ప్రధాని జీవనశైలి, షెడ్యూల్ గురించి ఎంపీలు అడిగారు. ఇది పూర్తిగా అసాధారణమని, ఎంపీల క్యాంటీలో ప్రధానిని కలవడం మంచి విషయమని లంచ్‌లో పాల్గొన్న ఒక ఎంపీ చెప్పారు. లంచ్ భేటీలో నవాజ్ షరీఫ్‌ని కలిసేందుకు పాకిస్తాన్ వెల్లడం, విదేశీ పర్యటనలు, స్టాచ్యు ఆఫ్ యూనిటీ మొదలైన వాటి గురించి ప్రధాని మాట్లాడారు. అబుదాబిలో నిర్మితమవుతున్న అతిపెద్ద హిందూ ఆలయం గురించి ఎంపీలకు వివరించారు. సమాచారం ప్రకారం.. ప్రధానితో లంచ్ గురించి ఎంపీలకు మధ్యాహ్నం సమాచారం వచ్చినట్లు తెలిసింది.