Parliament Sessions: నేడు అఖిలపక్షం భేటీ.. పార్లమెంట్ లో పలు బిల్లుల ఆమోదానికి కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. 19 రోజుల్లో 15 సిట్టింగుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ప్రహ్లాద్ జోషి, రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్ సహా వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొంటారు. కేంద్ర సర్కార్ కి సంబంధించిన పలు కీలక బిల్లులను పార్లమెంట్ సెషన్స్ లో ప్రవేశ పెట్టేందుకు రెడీ అయింది. ఈ బిల్లులపై అఖిల పక్షం సమావేశం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Read Also: Kurnool Medical College: సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు.. యూజీసీ కి ఫిర్యాదు
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
అయితే, పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చేందుకు మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మరో ఏడు కొత్త బిల్లులను ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అంతేగాక, ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లను ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు తీసుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మూడు బిల్లులపై ఇప్పటికే చర్చించి స్పీకర్ కు హోం శాఖ స్థాయి సంఘం నివేదికను ఇచ్చింది.
Read Also: China Virus: చైనాలో కొత్త వైరస్.. అమెరికా అప్రమత్తం.. రాకపోకలు నిషేదం..
ఇక, ముగ్గురు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ సమావేశాల్లో సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లనుంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలపై లోక్‌సభ ముందుకి ఎథిక్స్ కమిటీ నివేదిక వెళ్లనుంది. మొహువా మొయిత్రాపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఈ కమిటీ సూచించింది. లోక్ సభలో ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, రేపు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో, ఎల్లుండి మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!