TSPSC లో పేపర్ లీక్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో TSPSC ఆఫీస్ లో పోలీసుల సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు.
పేపర్ లీక్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . సాంకేతిక పరంగా టీఎస్పీస్సీ సర్వసు వీక్ గా ఉండడంతో పేపర్ లీక్ అయిందని అధికారులు చెప్తున్నారు.
ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు గుర్తించిన పోలీసులు. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను పోలీసులు గుర్తించి షాక్ కు గురయ్యారు.
మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం కానుంది. సర్వీస్ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 5 న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ పై కమిషన్ చర్చించనున్నారు.
మధ్యప్రదేశ్‌లో నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ నర్సుల నియామకం కోసం నిర్వహిస్తోన్న పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించడంతో రద్దు చేయబడింది.
గుజరాత్‌లో జూనియర్ క్లర్క్‌ల నియామకం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయింది. దీంతో ఆదివారం పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందే ఎగ్జామ్‌ను రద్దు చేశారు.