ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో యూపీ ఎస్టీఎఫ్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రధాన సూత్రధారి రవి అత్రి సహా 18 మంది నిందితులపై ఎస్టీఎఫ్ మీరట్ యూనిట్ 900 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
UGC-NEET 2024: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూజీసీ- నీట్ 2024 పరిక్షల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో బీహార్ కు సంబంధించిన అవుట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ప్రశ్న పత్రాలు పొందినట్లు నిర్ధారించారు.
నీట్-యూజీ2024 పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్2024 ఎలాంటి అవినీతి జరగలేదన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పరీక్షను రద్దు చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆరు నెలల్లో తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సీఎం తెలిపారు. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల పవిత్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.. యువత కష్టార్జితంతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోం. ఇలాంటి వికృత…
Minister Jagadish Reddy: 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అవార్డు రాలేదని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఎలాంటి ఎమోషన్స్ కూడా లేని ఈ ప్రభుత్వానికి బలగం సినిమా చూపించాలని బండిసంజయ్ సతీమణి అపర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా బండి సంజయ్ తో జిల్లా జైలులో కుటుంబ సభ్యులు వెళ్లి కలిసారు.
బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హనుమకొండ కోర్టు డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు 41ఎ నోటీసు జారీ చేయలేదని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోని కడపలో కూడా ఇలాంటి లీక్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీక్ అయింది.
టీఎస్‌పీఎస్ పేపర్ లీకేజ్ కేసులో నిందులను అదుపులో తీసుకున్న సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కొందరికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు పలువురు నిందితులను అదుపులో తీసుకున్న సిట్ ఇవాళ షమీమ్, సురేష్, రమేష్ లను రెండో రోజు విచారించున్నారు.