పేపర్ లీక్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . సాంకేతిక పరంగా టీఎస్పీఎస్సీ సర్వర్ వీక్ గా ఉండడంతో పేపర్ లీక్ అయిందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా గంపగుత్తగా పేపర్లను మొత్తాన్ని కేటుగాళ్లు కొట్టేసారని విచారణలో బయటపడింది. ప్రధానంగా కాన్ఫిడేషన్ రూమ్ లో ఉండాల్సిన పేపర్లు బయటి మార్కెట్లోకి వచ్చి పడ్డాయి. ఎక్కడైతే పేపర్ల బంచు ఉంటుందో దానిని మొత్తాన్ని కూడా ప్రవీణ్ గ్యాంగ్ కొట్టేసింది. టెక్నికల్ సర్వీసెస్ శాఖలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పాత్ర కూడా బట్టబయలు అయింది. అయితే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన నేరాన్ని అంగీకరించాడని పేర్కొంటూ, ఈ మొత్తం గందరగోళం ఎలా జరిగిందో వివరించింది.
Also Read : Meta Layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్.. మరో 10,000 మందిని తొలగిస్తూ మెటా నిర్ణయం..
TSPSC సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్ మెయిన్ సర్వర్ నుంచి ప్రశ్నాపత్రాన్ని కొట్టేశాడు. అతను లూప్ కంప్యూటర్ల ద్వారా ఆ కాగితాన్ని సేకరించాడు. ప్రవీణ్ సేకరించిన పేపర్ ప్రింట్ తీసుకుని తనతో సన్నిహితంగా ఉన్న రేణుకతో పంచుకున్నాడు. ఆపై.. రేణు కుటుంబం పేపర్ అమ్మేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.
Also Read : Off The Record: జనసేనాని డైలమాలో ఉన్నారా?
రేణుక తన వద్ద పేపర్ ఉందని చాలా మందికి తెలియజేసింది. ఈ ప్రచారంలో రేణుక భర్త, సోదరుడు కీలక పాత్ర పోషించారు. ఒక్కో పేపర్ కు రూ.20 లక్షలు ఇవ్వాలని రేణుక డిమాండ్ చేసింది. అయితే పేపర్ కొనేందుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకు వచ్చారు. వాటిని తన ఇంట్లోనే ఉంచి సిద్ధం చేసింది. పరీక్ష రోజున ఆమె వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి సరూర్‌నగర్‌లోని సెంటర్‌లో దించి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ ఫోన్‌లో చాలా మంది మహిళల కాంటాక్ట్‌లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు.. వారితో అతడికి సంబంధాలు ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఇది హనీ ట్రాప్? లేక పక్కా ప్లాన్డ్ స్కామా? ఇది ఇంకా ధృవీకరించబడలేదు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీకేజీ కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ లీకేజీ కేసులో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, వారికి రెండు వారాల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులకు వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.