హిమాచల్ ప్రదేశ్‌లో కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ చేపట్టింది. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ విషయాలు వెలుగులోకి వచ్చిన అనంతరం రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐ కేసును స్వీకరించింది.
తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం భ్రష్టు పట్టింది. తెలుగు విద్యార్థులు మాతృభాష పేపర్ కూడా రాయలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీలో టెన్త్ తెలుగు పేపర్ లీకేజ్ కలకలం రేపింది. లీకేజీ కాదు మాల్ ప్రాక్టీస్ అని తేల్చిన ప్రభుత్వం.. వాట్సాప్ గ్రూప్ పేపర్ సర్క్యులేట్ చేసిన వారిని అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి నారాయణతో పాటు 69 మంది టీచర్లు అరెస్టయ్యారు. ఇందులో 35 మంది ప్రభుత్వ స్కూల్ టీచర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చదువంటే మార్కులే…
ఏపీలో టెన్త్ పరీక్షలు జరుగుతోన్న సమయంలో.. ప్రశ్నాపత్రాల లీక్ వార్తలు కలకలం రేపాయి.. వరుసగా ప్రతీ పరీక్షపై ఏదో ఒక లీక్ వార్త ఆందోళన కలిగించింది.. అయితే, టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్‌పై ఏపీ సర్కార్ కఠిన చర్యలు ప్రారంభించింది.. నారాయణ సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసింది.. ప్రశ్నపత్రాలను వాట్సాప్‌లో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది షేర్ చేసినట్టుగా గుర్తించామని చెబుతున్నారు పోలీసులు.. దీనిపై చిత్తూరు పోలీసులు నిశిత దర్యాప్తు చేపట్టారు..…
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెన్త్ పరీక్షల సందర్భంగా రోజూ ఒకచోట పేపర్ లీక్ అంటూ వార్తలు రావడం… అవన్నీ ఫేక్ న్యూస్ అని.. జరిగింది మాల్ ప్రాక్టీసే అంటూ పోలీసులు స్పష్టం చేయడం తెలిసిన విషయమే. కానీ పేపర్ లీక్ జరిగింది నిజమే అని ప్రస్తుత పరిణామాల ద్వారా అర్థమవుతోంది. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్‌లు వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాట్సాప్ గ్రూప్‌లలో…
ఏపీలో బుధవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయ్యిందని వదంతులు రాగా కలెక్టర్ హరినారాయణ స్పందించి వాటిని ఖండించారు. తాజాగా నంద్యాల జిల్లాలోనూ టెన్త్ ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాచ్ మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3…
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే పేపర్ లీక్ అంశం స్థానికంగా కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు -1 పేపర్ వాట్సాప్‌లో రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. సోషల్ మీడియాలో బయటకు వచ్చిన పేపర్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అయితే పలమనేరులో పదో తరగతి…