Praveen phone: ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు గుర్తించిన పోలీసులు. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను పోలీసులు గుర్తించి షాక్ కు గురయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితులను మరికొద్ది సేపట్లో బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ తరలించనున్నారు పోలీసులు.రిమాండ్ అనంతరం కస్టడీలోకి తీసుకోవాలని పోలీసుల నిర్ణయించారు. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ మహిళలపై మక్కువ కలిగిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు. 2017లో టీఎస్పీఎస్సీ లో జూనియర్ అసిస్టెంట్గా ప్రవీణ్ చేరాడు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్ లో ప్రవీణ్ పనిచేశాడు. వెరిఫికేషన్ సెక్షన్ కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకున్న ప్రవీణ్.. దరఖాస్తు సందర్భంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు.
Read also: TSPSC Paper Leak: TSPSC పరీక్ష రద్దుపై ఉత్కంఠ.. మధ్యాహ్నం రానున్న క్లారిటీ
ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు ఉండమేకాకుండా.. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. కాగా.. ఏడాది క్రితం పదోన్నతి లభించి టిఎస్పిఎస్సి కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్లిన ప్రవీణ్.. ఉన్నతాధికారుల వద్ద ఎంతో క్రమశిక్షణతో మెలిగి బురిటీ కొట్టించాడు ప్రవీణ్. ఆతరువాత గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రవీణ్ రాసాడు. ఆన్సర్ షీట్ లో రాంగ్ బబులింగ్ తో డిస్ క్వాలిఫై అయినట్టు గుర్తించారు. అయితే.. ఆన్సర్ కీ తో చెక్ చేసుకుంటే 103 మార్క్స్ వచ్చాయని కమిషన్ వర్గాలు అంటున్నారు. కాగా.. గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఫోరెన్సిక్ విచారణ లో అంత బయట పడుతుందంటున్న పోలీస్ లు తెలిపారు. ప్రవీణ్ రేణుక ఫోన్ లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పటి నుండి జరిగిన చాటింగ్ రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రేణుక చెప్పినందుకే పేపర్ లీక్ చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇది వరకు ఏమైనా పేపర్ లు లీక్ అయ్యాయ అనే పనిలో పోలీసులు అరా తీస్తున్నారు.
TS Inter Exams: టెన్షన్ వద్దు.. ‘సెంటర్ లొకేటర్’ యాప్‌తో ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లడం ఇక ఈజీ