అసలు ప్రవీణ్ ఎవరు? ఏకంగా నిరుద్యోగుల జీవితాన్ని ఎందుకు చెలగాటమాడుకున్నాడు. పేపర్ బయటికి తెచ్చేంత ధైర్యం ప్రవీణ్ కు ఎందుకు వచ్చింది. ఈ పని చేశాడా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిమీద పోలీసులు విచారించినప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి. 2017 సమయంలో ప్రవీణ్ తండ్రి హరిచంద్ర రావు చనిపోయాడు. ఆ తర్వాత ప్రభుత్వం జాబ్ ఇతనికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్వాలిఫికేషన్ ఆధారంగా టీఎస్పీఎస్సీ లో ప్రవీణ్ కి ఉద్యోగం వచ్చింది . 2018 నుంచి ప్రవీణ్ ఇక్కడ పనిచేస్తున్నాడు. ఆర్థికపరంగా కుటుంబం మొత్తం కూడా స్థిరంగానే ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవు. అయితే 32 సంవత్సరాల వయసు ఉన్న ప్రవీణ్ కి ఇతర వ్యపకాలు ఉన్నట్లుగా పోలీసుల విషయాలలో బయటపడింది. 2018లో రేణుకతో ప్రవీణ్ కి పరిచయం ఏర్పడింది. రేణుక హిందీ పండిట్ ఉద్యోగానికి పరీక్షలు రాసింది. ఆ సమయంలో కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ప్రవీణ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చాలా ముందుకు వెళ్లినట్లుగా పోలీసులకు సమాచారం. అయితే దాని గురించి పోలీసులు వివరంగా చెప్పలేకపోతున్నారు.
Also Read : Top Headlines @9PM: టాప్ న్యూస్
2018 తర్వాత టీఎస్పీఎస్సీలో ఉన్న సమస్య తీరిపోవడంతో రేణుకకు ఉద్యోగం వచ్చింది. వనపర్తి ఎస్సీ గురుకుల పాఠశాలలో రేణుక ఉద్యోగం చేస్తున్నారు . తనకి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా రేణుక ప్రవీణ్ తో స్నేహం కంటిన్యూగా చేసింది. ఈ స్నేహం తోటే ఇద్దరి మధ్య వ్యక్తిగత ఫోటోలు పంచుకుని స్థాయికి వెళ్లారు.. వారి వ్యక్తిగత ఫోటోలు చూసి పోలీసులే అవాక్కయ్యారు.ఎందుకంటే అలాంటి ఫోటోలు కూడా వీళ్ళిద్దరూ షేర్ చేసుకోవడం జరిగింది.. ఇద్దరి మధ్య ఉన్న గాఢమైన స్నేహం నేపథ్యంలోనే తన సోదరుడి పరీక్ష కోసం హెల్ప్ చేయాలని రేణుక అడిగింది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ తనకు డబ్బులు ఇచ్చినట్లయితే పరీక్ష పేపర్ను తీసుకువస్తారని చెప్పాడు..
ముందస్తుగా కొన్ని డబ్బులు ఇవ్వడంతో ప్రవీణ్ మెయిన్ సర్వర్లో ఉన్న పేపర్లను బయటికి తీసుకువచ్చి రేణుకకు ఇచ్చేశాడు.
Also Read : Off The Record: కిరణ్ కుమార్ రెడ్డితో బీజేపీకి లాభమెంత?
రేణుకకు ప్రవీణ్ ఎక్సమ్ పేపర్ ఇవ్వడంతో అప్పుడు అసలు కథను ఆమె నడిపించింది. తన భర్తతో కలిసి వ్యవహారాన్ని మొత్తం ముందుకు నడిపించింది. దీని వెనకాల కీలక సూత్రధారిగా రేణుక సోదరుడు ఉన్నాడు. రేణుక సోదరుడు వ్యాపారాలు చేసి తీవ్ర స్థాయిలో నష్టపోయాడు. ఈ సమయంలోనే సోదరి ఆయిన రేణుక ఎగ్జాం పేపర్ను బయటికి తీసుకు వస్తానని దానిని అభ్యర్థులకు అమ్మి సొమ్ము చేసుకోమని చెప్పింది. తల్లి కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోదరుడు తల్లి ఇద్దరనీ కూడా ఆదుకోవాలని అనుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ కి చెప్పి పేపరు తీసుకొని బయటికి వచ్చింది. ఆ పేపర్ ని తమ్ముడికి ఇచ్చివేసింది. అయితే ఈ పేపర్ ని అమ్ముతే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని భావించింది.. తన అన్నకు భర్తకు విషయాన్ని చెప్పింది.. వారు ఇద్దరు కలిసి తమ కమ్యూనిటీలో ఎవరైతే ఏ ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేశారు.
Also Read : Anjali: చరణ్ సినిమా తరువాత అంజలి పెళ్లి..?
అందులో ఇద్దరు వ్యక్తులు పేపర్ కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా 10 లక్షల చొప్పున ఇవ్వడానికి అంగీకరించారు. ఇందులో ముందస్తుగా 15 లక్షల రూపాయలను రేణుకకు ఇవ్వడం జరిగింది. అందులో పది లక్షల రూపాయలు తీసుకువెళ్లి రెండు దఫాలుగా ప్రవీణ్ కి చేరవేశారు. పేపర్ లు కొనుగోలు చేసిన వాళ్ళ ఇద్దరినీ కూడా వనపర్తిలోని తన ఇంట్లోనే రేణుక ఉంచుకున్నారు. ఇద్దరినీ తమ ఇంటిలోనే పెట్టుకొని ఆ ఇద్దరిని కూడా నేరుగా పరీక్షా కేంద్రాల వద్ద దించి వెళ్లిపోయారు. భర్త, సోదరుడి కలిసి తమ కమ్యూనిటీలోని చాలామందిని పేపర్ కావాలంటే 20 లక్షలు ఇవ్వండి అని చెప్పారు. రేణుక భర్త, సోదరుడు ఇందులో భాగంగా ఒక కానిస్టేబుల్ ని కూడా వీళ్ళు కాంటాక్ట్ చేశారు. అయితే తాను అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వలేదని చెప్పి మరొకరి పేరు చెప్పడంతో ఈ విషయం తెలిసిన కూడా చెప్పకపోవడంతో సదరు కానిస్టేబుల్ ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.