పేపర్ లీక్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . సాంకేతిక పరంగా టీఎస్పీస్సీ సర్వసు వీక్ గా ఉండడంతో పేపర్ లీక్ అయిందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా గంపగుత్తగా పేపర్లను మొత్తాన్ని కేటుగాళ్లు కొట్టేసారని విచారణలో బయటపడింది. ప్రధానంగా కాన్ఫిడేషన్ రూమ్ లో ఉండాల్సిన పేపర్లు బయటి మార్కెట్లోకి వచ్చి పడ్డాయి. ఎక్కడైతే పేపర్ల బంచు ఉంటుందో దానిని మొత్తాన్ని కూడా ప్రవీణ్ గ్యాంగ్ కొట్టేసింది. టెక్నికల్ సర్వీసెస్ శాఖలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పాత్ర కూడా బట్టబయలు అయింది. అయితే డబ్బుల కోసమే ప్రవీణ్ ఈ పని చేశాడా లేక ఇంకా దేనికోసమైన చేశాడా అనే దానిమీద పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల ఎంక్వైరీలో అమ్మాయిలతో ఉన్న పరిచయాలే ప్రవీణ్ ను పక్కదారి పట్టించాయనీ పోలీసులు అంటున్నారు. అంతేకాదు టీఎస్పీఎస్సీకి వచ్చే మహిళలు అమ్మాయిలను ప్రవీణ్ వాళలో వేసుకుంటాడని పోలీసుల విచారణలో తేలింది.
Also Read : Off The Record: జనసేనాని డైలమాలో ఉన్నారా?
అయితే ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్షలు జరిగిపోయాయి. దాంతోపాటు AE ఎగ్జామ్స్ కూడా జరిగాయి. పోలీసులు అధికారికంగా మాత్రం ఏఈ ఎగ్జామ్స్ పరీక్ష పేపర్ లీక్ అయినట్టుగా గుర్తించారు. అయితే 12వ తేదీన జరగాల్సిన పరీక్షను టీఎస్పీఎస్సీ ముందుగానే వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షలు మొత్తంగా కూడా ఏం చేయాలి అన్న దానిపైన అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు టీఎస్పీఎస్సీలో పనిచేస్తూనే ప్రవీణ్ గ్రూప్ వన్ పరీక్షలు రాశాడు. ఆ పరీక్షల్లో కూడా అతనికి మంచి మార్కులు రావడం జరిగింది. దీంతో పోలీసులకు ఇప్పుడు కొత్త అనుమానం వచ్చింది. గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించిన పేపర్ను ప్రవీణ్ సంపాదించి ఆ మేరకు పరీక్షలు రాశారని అనుమానం వ్యక్తపరుస్తున్నారు.
Also Read : Janasena 10th Formation Day Sabha Live: దిగ్విజయభేరి పవన్ సభ లైవ్
గ్రూప్ వన్ పరీక్షలు రాసిన ప్రవీణ్ ఎగ్జామ్ పేపర్ కు సంబంధించిన ఆన్సర్ షీట్ని ఎన్టీవీ సంపాదించింది. అయితే ఇప్పుడు పోలీసులతోపాటు టిఎస్ఎస్పిసి దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ రాసిన గ్రూప్ వన్ పరీక్షల ఫలితాల పైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రవీణ్ టీఎస్పీఎస్సీ కార్యదర్శి దగ్గర పని చేస్తూనే గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ వన్ పరీక్షలు రాశాడు. ఇప్పుడు ఏదైతే ae పరీక్ష పేపర్ ని మెయిన్ సర్వర్ నుంచి కొట్టేసి బయటికి ఎలా విక్రయించాడో.. అప్పుడు కూడా గ్రూప్ వన్ పేపర్ ని చోరీ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రూప్ వన్ పేపర్ ని కూడా ప్రవీణ్ లీక్ చేసి ఎవరికైనా అమ్ముకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రవీణ్ కు సంబంధించిన 103 మార్కులతో కుడా ఇప్పుడు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ గ్రూప్ వన్ పరీక్ష పేపర్ కనుక ప్రవీణ్ లీక్ చేసి అమ్ముకున్నట్లయితే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన టీఎస్పీఎస్సీ మల్ల గులాలు పడుతుంది.