పల్నాడులో విషాదం చోటు చేసుకుంది. బావిలో స్నానానికి దిగి ఇద్దరు శివ మాలధారులు స్వాములు మృతి చెందారు. ఈ ఘటన వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శివ మాల వేసుకున్న మొత్తం ముగ్గురు స్వాములు స్నానం చేయడం కోసమని దిగుడు బావిలోకి దిగారు. ఈ క్రమంలో స్వాములు గల్లంతు కాగా.. ప్రమాదవశాత్తు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రేమ కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. క్రోసూరుకు చెందిన యువకుడు మస్తాన్ వలి సెల్‌టవర్ ఎక్కగా.. పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. క్రోసూరు గ్రామానికి చెందిన మస్తాన్ వలి అనే యువకుడు సిరిపురం గ్రామానికి చెందిన యువతిని పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు రైస్ మిల్లులలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లిలో అనేక మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ బ్రాంచ్ లో 72 మంది బాధితులు తమ డబ్బు పోగొట్టుకున్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు.
ICICI Bank Fraud: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్లో గోల్ మాల్ పై అధికారుల చర్యలు చేపట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ లోన్ ఖాతాదారుల అకౌంట్లలో డబ్బు, బంగారం మాయం అయినట్లు గుర్తించారు. మాయమైన సొమ్ము కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Women Protest: పల్నాడు జిల్లాలో ఓ మహిళ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తుంది.. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పొలంలో ఆమరణ దీక్షకు దిగింది.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. అడ్డుకున్న నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
Kondaveedu Fort: పల్నాడు జిల్లాలోని కొండవీడు కోట ప్రాశస్త్యం, రెడ్డిరాజుల పాలనా వైభవం, తెలుగు సాహిత్య ఘనకీర్తిని భావితరాలకు అందించేందుకు వారధిగా నిలుస్తోన్న కొండవీడు.. నేడు అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సత్యా ఏజెన్సీస్ 24వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని గోవిందరావు రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయనతో పాటు సత్యా ఏజెన్సీస్ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.