పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో పెద్దపులి మృతి చెందినట్లు తెలుస్తోంది. మాచర్ల సమీపంలోనీ లోయపల్లి అటవీ ప్రాంతం వద్ద జంతువు కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
అత్తింటి కాపురం కత్తి మీద సాము లాంటిది అంటారు మన పెద్దలు. అయితే కూతురును అత్తింటి వారు వేధిస్తున్నారని ఆ అత్తింటి వారినే కత్తులతో పొడిచి కడతేర్చారు ఓ కోడలి తరుపు బంధువులు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఆషాడ మాసం సందర్భంగా ట్రాన్స్ జెండర్లు అమ్మవారికి మేళాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇంటి నుంచి గంగమ్మ తల్లి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా బోనాలతో వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని వెల్లడించారు.
Fake Lawyers: న్యాయవ్యవస్థలోనూ నకిలీలు చొరబడ్డారు.. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి న్యాయవాదులుగా చలామణి అవుతున్నారు.. ఇప్పుడు ఈ వ్యవహారం పల్నాడులో కలకలం రేపుతోంది.. విద్యార్హతలు లేకపోయినా.. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి న్యాయవాదులుగా చలామణీ అవుతున్నారు. చట్టం, ధర్మం, న్యాయాలను పరిహసిస్తున్నారు. చట్టంపై ఏ మాత్రం అవగాహన లేని వీరు కక్షిదారులను మోసం చేస్తున్నారు. న్యాయవాదుల వద్ద కొందరు గుమాస్తాలుగా చేరి.. కోర్టుల్లో కేసులకు సంబంధించిన విధివిధానాలపై అవగాహన పెంచుకుని.. ఆ తర్వాత నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా మారి…
CM Jagan: ఏపీ సీఎం జగన్ జోరుగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో జరిగిన దాడి ఘటనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు…
ఆంధ్రప్రదేశ్‌లో మరో టీడీపీ నేతపై దుండగులు దాడి చేశారు.. ఇప్పటికే ఏపీలో పలువురు టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు.. కొందరు తృటిలో తప్పించుకున్నారు.. వారి హత్యకు కారణాలు ఏమైనా.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.. అయితే, తాజాగా మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై దాడికి పాల్పడ్డారు దుండగులు.. అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన…
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించారు. బొల్లాపల్లి మండలం రావులాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కారు ముందు భాగంలో కూర్చుని అభిమానులకు లోకేష్ అభివాదాలు చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను హత్య చేస్తే భయపడతామని జగన్ మాఫియా రెడ్డి భ్రమపడుతున్నారని ఆరోపించారు.…