Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ బ్రాంచ్ లో 72 మంది బాధితులు తమ డబ్బు పోగొట్టుకున్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు. చిలకలూరిపేట బ్రాంచ్ లో రూ. 28 కోట్ల స్కాం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ, బ్రాంచ్ లలో కూడా నరేష్ చంద్రశేఖర్ అనే మేనేజర్ తో పాటు మరో ఇద్దరు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
Read Also: Ratan Tata Dog: రతన్ టాటా భౌతికకాయం దగ్గర దీనంగా కూర్చున్న కుక్క
ఇక, దర్యాప్తులో పూర్తి వివరాలు వస్తాయని ఏపీ సిఐడి అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం విజయవాడలోని సీఐడీ అధికారులకు ఐసీఐసీఐ బ్యాంకు జోనల్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసిన వ్యవహారంలో చిలకలూరిపేట బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు. ఖాతాదారుల ఎఫ్‌డీలు దారి మళ్లించడంతో పాటు ఎంత మొత్తంలో నగదు దారి మళ్లించారనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.