తమ స్థలంలో లంకె బిందెలు ఉన్నాయని.. పురావస్తుశాఖ ద్వారా తవ్వించాలంటూ ఓ మహిళ సాక్షాత్తు గ్రీవెన్స్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ను కోరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన దిల్షాద్ బేగం అనే ముస్లిం మహిళ తన పూర్వీకుల స్థలం కారంపూడిలోని కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కన గల బజారులో ఉందని.. సదరు స్థలంలో లంకెబిందెలు ఉన్నట్లు తనకు తెలిసిందని స్వయంగా పల్నాడు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.…
పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను శనివారం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి నర్సరావుపేటలో టీడీపీ నేతలు పర్యటించాలని తలపెట్టారు. సోమవారం నాడు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురంలో టీడీపీ బీసీ నేతలు పర్యటించనున్నారు. ప్రత్యర్థుల చేతిలో హతుడైన జల్లయ్య కుటుంబాన్ని వాళ్లు పరామర్శించనున్నారు. Ganta Srinivasrao: టెన్త్ ఫలితాలు వాయిదా వేయడం…
పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని తెలిసి తాను తీవ్ర విచారానికి లోనైనట్టు తెలిపారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తున్న వీరు ప్రమాదవశాత్తు చనిపోవడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోజూవారీ కూలీపై ఆధారపడి జీవించే వారి కుటుంబాలను ప్రభుత్వం…
పల్నాడు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెంటచింతలలో టాటా ఎస్ వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. . మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని తిరిగి పయమనమయ్యారు. కాసేపట్లో ఇంటికి వెళ్లనుండగా ఇంతలోనే మృత్యువు కాటేసింది. రెంటచింతల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. Konaseema:…
నందమూరి నటసింహం చిలకలూరిపేటలో సందడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ వేడుకల్లో దర్శకుడు బోయపాటి శ్రీను, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అశేష ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య డైలాగ్స్ తో అభిమానుల్లో జోష్ నింపారు. వంద రోజులు వినడమే గగనమైన రోజుల్లో సింహా, లెజెండ్ అఖండ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఆనందంగా…
పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో నాగులు ఇంటి సభ్యులు ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ దాడి ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని టీడీపీ కార్యకర్త ఇంటికి చేరుకోవడంతో వైసీపీ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే కక్ష్యతోనే వైసీపీకి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ మునగ రమాదేవి భర్త, కుమారులు ఈ దాడికి…
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.…
ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో… నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసే జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని లేఖలో కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. Read Also: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదు: పీఆర్సీ సాధన సమితి ఇది చాలా కాలంగా…