మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపీపై ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది.. ఇద్దరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు చిలకలూరిపేటకి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం.. 2022 ఏప్రిల్ లో రజిని అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు..
Palnadu: పల్నాడు జిల్లాలో ప్రేమ వివాదం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియుడు మోసం చేయటమే కాక చంపేస్తానని బెదిరించడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వినుకొండకు చెందిన యువతి సెల్ఫీ విడుదల చేసింది.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలవ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
పల్నాడు జిల్లాలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు... తనది పురుషోత్తమ పట్నం అని, తనపై అక్రమ కేసులు పెడితే ఏం జరుగుతుందో చూస్తారు అంటూ మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు... నాకే కాదు కుటుంబం, ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా కుటుంబం ఉంటుందని, తాను మరో 30 ఏళ్లు చిలకలూరిపేట రాజకీయాల్లోనే ఉంటానని, నేను అధికారంలోకి వస్తే, రాజకీయాల నుండి రిటైర్డ్ అయినా…
Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మోసాలపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. విజయ లక్ష్మీ టౌన్ షిప్ పేరుతో నడుపుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలో 2.8 కోట్ల రూపాయలు నష్టపోయామని సుబ్బారెడ్డి అనే బాధితుడు పల్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను కాలువలో పడేశాడు కుమారుడు.
పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.. అనారోగ్యంతో ఓ వృద్ధుడు కన్నుమూస్తే.. మద్యం సేవించి కుమారుడు, అతడి బామ్మర్ది గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది..
పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలుకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఎయిర్ కంప్రెషర్ అందజేశారు. ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాన్ని.. జిల్లా కలెక్టర్ వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇయర్ ఎండ్‌లో ఒకరోజు ముందుగానే పెన్షన్‌దారులకు డబ్బులు అందబోతున్నాయి.. పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది... డిసెంబర్ 31వ తేదీ సంవత్సర చివరలో , పెన్షన్ పండుగలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాస్తవానికి 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, లబ్ధి దారులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది.. ఈ నేపథ్యంలో పల్నాడు…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండి (31వ తేదీ)న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం.