మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడుతో టెన్షన్ కొనసాగుతోంది. నరసరావు పేటలో పిన్నెల్లి ఉంటున్న గృహం చుట్టూ పోలీసులు మోహరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సంతకం చేసేందుకు కొద్దిసేపటి క్రితం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరోవైపు పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.
పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఘర్షణలలో దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ చేశారు. సిట్ టీమ్ దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. బస్సు బయలుదేరినప్పటి నుంచి ప్రయాణికుల్లో ఆందోళన నెలకొందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. బస్ డ్రైవర్ యమ స్పీడుతో నడిపారని పోలీసులకు సమాచారం. చిన గంజాం నుంచి బయలుదేరినప్పటి నుంచి బస్సును డ్రైవర్ అంజి ఓవర్ స్పీడ్ గా నడిపినట్లు చెప్పుకొచ్చారు.
పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది.
పలనాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరొకసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్లలోని 28వ వార్డులో పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు కడుతున్నారు టీడీపీ నాయకులు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. సీట్లు దక్కనివారు, ఆశిస్తున్నవారు పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.