Kondaveedu Fort: పల్నాడు జిల్లాలోని కొండవీడు కోట ప్రాశస్త్యం, రెడ్డిరాజుల పాలనా వైభవం, తెలుగు సాహిత్య ఘనకీర్తిని భావితరాలకు అందించేందుకు వారధిగా నిలుస్తోన్న కొండవీడు.. నేడు అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. సుందరమైన ఘాట్ రోడ్డు, పురాతన కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, అరుదైన ఔషధ వృక్షాలను చూస్తూ సరికొత్త అనుభూతిని సొంతం చేసుకునే పర్యాటకులు.. ప్రస్తుతం ఆకతాయిల వికృత చేష్టలు, అసాంఘిక కార్యకలాపాలు, మందుబాబుల చర్యలకు ఇబ్బందులకు గురవుతున్నారు.
Read Also: Tolly Wood : మలయాళ దర్శకుడితో మైత్రి మూవీస్..ఇంతకి ఎవరా దర్శకుడు..?
అయితే, 2019లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కొండవీడు గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కాసులకు కక్కుర్తి పడుతున్న చెక్ పోస్ట్ సిబ్బంది.. ఎటువంటి చెకింగ్ చేయకుండా కొండపైకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతిస్తున్నారు. ఇలాగే, కొనసాగితే కొండవీడు కోట ప్రాముఖ్యతను భావితరాల వారు వేరేలా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. కోటను ‘ఎకో టూరిస్టు హబ్’గా మారుస్తూనే.. ఇక్కడున్న చారిత్రక సంపదను పరిరక్షిస్తాం.. పటిష్టం చేస్తామని ప్రభుత్వాలు గొప్పగా చెప్పి నిధులు కేటాయించినా కొండవీడు కోట చరిత్రను చించేస్తున్న సిబ్బంది, అధికారులు.. ఇలాగే కొనసాగితే పర్యాటకులు తగ్గి, కొండ ప్రాశస్త్యం సన్నగిల్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇటువంటి ముఖ్యమంత్రి, పర్యాటక మంత్రి, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.