శాసన మండలి మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో ప్రగతిభవన్ ను పేల్చివేయాలని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు అందరూ కలిసి డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ప్రవేశపెట్టారు. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరుగలేదని అన్నారు.